ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇకపై తరగతి గదుల్లో మొబైల్ ఫోన్లు వాడకూడదని తెలంగాణ విద్యాశాఖ నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. తరగతి గదుల్లో ఉపాధ్యాయులు మొబైల్ ఫోన్లు వినియోగిస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోనున్నారు. అయితే ఈ నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. కొందరు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తుండగా.. మరి కొందరూ వ్యతిరేకిస్తున్నారు.