Telangana Govt Schools: రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే.. గృహ జ్యోతి పేరుతో 200 మేర ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా.. ఇప్పుడు.. రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థలన్నింటికీ ఉచితంగా విద్యుత్ అందించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న భట్టి.. ఈ ప్రకటన చేశారు.