విద్యుత్ వినియోగదారులకు ఉపశమనం కలిగించే వార్త వచ్చేసింది. మొన్నటివరకు మొబైల్స్‌లోని డిజిటల్ పేమెంట్ యాప్‌లతో ఎంతో సులభంగా కరెంట్ బిల్లులు కట్టుకున్న కస్టమర్లు.. ఆర్బీఐ మార్గదర్శకాలతో ఆ చెల్లింపులను నిషేదించారు. ఫలితంగా.. వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీన్ని పరిగణలోకి తీసుకున్న డిస్కంలు.. భారత్ బిల్ పేమెంట్ సిస్టం(BBPS)లో చేరిపోయాయి. దీంతో.. మళ్లీ ఫోన్ పే, గూగుల్ పే లాంటి యాపుల్లో బిల్లులు కట్టే అవకాశం దొరికింది.