వినియోగదారుల సౌకర్యార్థం పోస్టల్ డిపార్ట్‌మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటి వద్ద నుంచే రిజిస్టర్ పోస్టు బుకింగ్ సేవలు అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. జూలై 22 నుంచి ఇళ్ల వద్ద నుంచే రిజిస్టర్ పోస్ట్ బుకింగ్ సేవలు అందించనుంది. ఈ విధానంలో 500 రూపాయల లోపు విలువైన ఆర్టికల్స్ రిజిస్టర్ పోస్టు, స్పీడ్ పోస్టుకు ఎలాంటి సర్వీస్ ఛార్జీ లేదు. రూ.500 విలువకంటే ఎక్కువ విలువైన ఆర్టికల్స్‌కు నిర్ణీత మొత్తంలో సర్వీస్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.