వినూత్న ఆలోచన చేసిన ఆ గ్రామ సర్పంచ్.. కేవలం రూ.1కే అంత్యక్రియలు..

7 months ago 22
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లి సర్పంచ్ దూలం కళ్యాణ్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో ఎవరైనా మరణిస్తే వారి కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో, కేవలం ఒక్క రూపాయికే అంత్యక్రియలు నిర్వహించేలా గ్రామసభలో తీర్మానం చేశారు. ఇందుకు అయ్యే పూర్తి ఖర్చును గ్రామ పంచాయతీ నిధుల నుంచే భరించనున్నారు. పేదలకు ఆర్థిక భారం తగ్గించేలా తీసుకున్న ఈ మానవీయ నిర్ణయంపై జిల్లావ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. నిరుపేద కుటుంబాలకు అండగా నిలవాలన్న సర్పంచ్ సంకల్పం ఇప్పుడు ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలిచింది.
Read Entire Article