Kishan Reddy: హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీల నేతలు హాజరు కాగా.. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఒకరిపై ఒకరు పరస్పరం కౌంటర్లు వేసుకున్నారు. కార్యక్రమంలో హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. రాజకీయ పార్టీల నేతల విమర్శలపై కీలక వ్యాఖ్యలు చేశారు. విమర్శించుకుందాం కానీ ప్రజలు అసహ్యించుకునేలా కాదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ వేశారు.