Visakhapatnam Woman Youth Suicide In A Village: విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం కృష్ణాపురంలో రెండు మరణాలు మిస్టరీగా మారాయి. అదే ఊరికి చెందిన వివాహిత, యువకుడు ఒకే రోజు కొన్ని నిమిషాల గ్యాప్‌లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకోవడం మిస్టరీగా మారింది. ఇద్దరి మరణాలకు కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వివాహిత భర్త లారీ డ్రైవర్ కాగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. చనిపోయిన యువకుడు కాంట్రాక్ట్ ఉద్యోగి.