విశాఖ: నిండుచూలాలని కూడా చూడకుండా.. భార్యను హత్య చేసిన భర్త..

2 days ago 4
Husband kills Pregnant wife in Vizag: విశాఖపట్నం మధురవాడ ఆర్టీసీ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. భార్యను హత్య చేశాడో భర్త. 8 నెలల గర్భిణి అనూషను భర్త జ్ఞానేశ్వర్ గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. భార్యను గొంతునులిమినట్లు ఒప్పుకున్నాడు. జ్ఞానేశ్వర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. మరోవైపు అనూష, జ్ఞానేశ్వర్‌కు మూడేళ్ల కిందట ప్రేమ వివాహం జరిగింది. ఈ ఘటనతో అనూష కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Read Entire Article