Tahsildar Ramanaiah Wife Job: గతేడాది విశాఖపట్నంలో దారుణ హత్యకు గురైన తహసీల్దార్ రమణయ్య భార్య అనూషను డిప్యూటీ తహసీల్దార్‌గా నియామిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రమణయ్య భార్య అనూషకు కారుణ్య నియామకంలో భాగంగా డిప్యూటీ తహసీల్దార్‌గా ఉద్యోగం ఇచ్చారు. గత ఏడాది ఫిబ్రవరి 2వ తేదీ రమణయ్య హత్యకు గురయ్యారు. రమణయ్య కుటుంబాన్ని ఆదుకుంటామని, ఆయన కుటుంబానికి అండగా ఉంటుందని అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు.. ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకున్నారు.