ఆంధ్రప్రదేశ్‌లో వైద్య రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా విశాఖపట్నంలో ప్రపంచస్థాయి ఆరోగ్య సంరక్షణ, విద్య, పరిశోధన కేంద్రం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు హైదారాబద్‌కు చెందిన ఆసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ (ఏఐజీ) హాస్పిటల్స్‌కు 9.04 ఎకరాల భూమిని కేటాయించడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ భూమి కేటాయింపు ప్రభుత్వం నిర్ణయించిన షరతులకు లోబడి ఉండనున్నట్లు సమాచారం. కాగా, ఒక్కో ఎకరం రూ. 5 కోట్లకు కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది.