Ap Minister Nara Lokesh Apologies To Visakhapatnam Car Owner: ఏపీ మంత్రి నారా లోకేష్ సామాన్యుడికి క్షమాపణలు చెప్పడం ఏంటని అనుకుంటున్నారా. అవును విశాఖపట్నంలో జరిగిన ఓ ఘటనపై స్పందించిన లోకేష్.. తన కాన్వాయ్ వల్ల ఓ కారుకు జరిగిన డ్యామేజ్‌కు బాధ్యత వహించారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా లోకేష్ కారు యజమానికి క్షమాపణలు చెప్పారు.. మరోసారి ఇలా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. అలాగే ఆ కారు డ్యామేజ్ రిపేర్ ఖర్చుల్ని తానే భరిస్తాను అన్నారు.