విశాఖలో కొంత మంది విద్యార్థులు రెచ్చిపోయారు. రెండు వర్గాలుగా విడిపోయి నడిరోడ్డుపైనే ఫైటింగ్‌కు దిగారు. చుట్టు ఉన్న జనం చెప్తున్నా పట్టించుకోకుండా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో కాసేపు ఆ ప్రాంతంలో ఉద్రిక్తత ఏర్పడింది. రోడ్డుపై రాకపోకలకు అంతరాయం కలిగింది. అయితే స్థానికులు సర్దిచెప్పడంతో విద్యార్థులు శాంతించారు. అయితే ఘర్షణకు గల కారణాలు తెలియరాలేదు. అయితే గొడవ జరుగుతున్న సమయంలో ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. ప్రస్తుతం ఈ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.