Visakhapatnam Unity Mall Update: విశాఖపట్నం వాసులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. మధురవాడలో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న యూనిటీ మాల్ నిర్మాణానికి రూ.10 కోట్లు విడుదల చేసింది. కేంద్రం చేనేత, హస్తకళల ప్రోత్సాహానికి రూ.172 కోట్లతో ఈ ప్రాజెక్టును మంజూరు చేసింది. జీ+4 అంతస్తుల్లో రూపుదిద్దుకోనున్న ఈ మాల్‌లో షాపులు, ఫుడ్ కోర్టులు, థియేటర్లు, వినోద ప్రదేశాలు ఏర్పాటు చేయనున్నారు. 2026 నాటికి ఈ మాల్‌ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.