విశాఖపట్నంలో అత్యాధునిక క్యాన్సర్ ఆస్పత్రి రూపుదిద్దుకోనుంది. తూర్పు రాష్ట్రాల క్యాన్సర్ రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మెమోరియల్ సెంటర్ సంయుక్తంగా అడ్వాన్స్‌డ్ క్యాన్సర్ కేర్ బ్లాక్‌ను ఏర్పాటు చేస్తున్నాయి. రూ.550 కోట్లతో 3.9 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎనిమిది అంతస్తుల భవనాన్ని నిర్మించనున్నారు. 2027 నాటికి ఇది అందుబాటులోకి వస్తే, ఏటా 3,000 మందికి అదనంగా సేవలు అందించవచ్చు.