విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు అనేది విభజన చట్టంలో ఇచ్చిన హామీ. దీనికి సంబంధించిన డీపీఆర్‌ను 2019 సెప్టెంబర్‌లో రైల్వే బోర్డు ఆమోదించింది. కానీ ఇప్పటివరకు రైల్వేజోన్ పనులకు సంబంధించి ఒక్క అడుగు ముందుకు పడలేదు. రైల్వే జోన్ కోసం కేంద్రం కోరిన భూములు సిద్ధంగా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం అంటే.. అవి వివాదంలో ఉన్నాయని కేంద్రం ఇప్పటి వరకూ ఒకరిపై ఒకరు నిందలు వేసుకున్నారు.