తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సీపీఆర్వో మారబోయిన మధుసూదన్ సోమవారం (ఏప్రిల్ 27) గుండెపోటుతో కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఇంట్లో అస్వస్థతకు గురికాగా.. కుటుంబ సభ్యులు హాస్పిటల్ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూనే ఆయన ప్రాణాలు కోల్పోయారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ఆయన.. గతంలో పలు తెలుగు దిన పత్రికల్లో సీనియర్ జర్నలిస్టుగా పనిచేశారు. మధుసూదన్ మృతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా పలువురు మంత్రులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.