వీఐపీల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీఐపీల సెక్యూరిటీ కోసం 10 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాల కొనుగోలు కోసం ఏపీ హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. 10 టయోటా ఫార్చునర్ వాహనాలు కొనుగోలు చేసి.. వాటిని బుల్లెట్ ప్రూఫ్ వాహనాలుగా మార్చాలని ఏపీ హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ వాహనాలను రాష్ట్రంలోని ముఖ్యులతో పాటుగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వీఐపీల కోసం ఉపయోగిస్తారు. ఈ బుల్లెట్ ప్రూఫ్ వాహనాల కొనుగోలు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 9.20 కోట్లు ఖర్చు చేయనుంది.