సికింద్రాబాద్‌లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఘటనలో డాక్టర్ నమ్రత సహా 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. భర్త వీర్యానికి బదులుగా వేరొకరి వీర్యంతో సంతానం కలిగించినట్లు డీఎన్‌ఏ పరీక్షలో తేలడంతో ఈ దందా వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులకు రూ. 5-10 వేలు చెల్లించి పోర్న్ వీడియోలు చూపిస్తూ, ఆరోగ్య ప్రమాణాలు లేకుండా వీర్యాన్ని సేకరించినట్లు గుర్తించారు. అలా సేకరించిన వీర్యాన్ని గుజరాత్, మధ్యప్రదేశ్‌లకు తరలిస్తున్నట్లు తేలింది.