వృద్ధులకు ఒంటరితనాన్ని దూరం చేస్తూ వారిలో మానసికోల్లాసాన్ని నింపేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణామ్ పేరుతో మల్టీ సర్వీస్ డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేసింది. దేశంలోనే మొదటిసారిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కేంద్రాల్లో లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, వైద్య సేవలు, ఉచిత అల్పాహారం అందుబాటులో ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన ఈ కేంద్రాలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 37 చోట్ల వృద్ధులకు సామాజిక భద్రతను, ఆరోగ్యాన్ని కల్పిస్తూ ఆసరాగా నిలుస్తున్నాయి.