హైదరాబాద్ శివార్లలో వెటర్నరీ డాక్టర్ హత్యోదంతం నేపథ్యంలో రాచకొండ పోలీసులు అప్రమత్తమయ్యారు. వాహనం పాడైతే మాకు ఫోన్ చేయండని.. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వాహనాలపై వెళ్లేటప్పుడు బైక్ పంక్చర్ లాంటి సమస్యలు తలెత్తితే... వెంటనే పోలీసుల సాయం తీసుకోవాలని కమిషనర్ సూచించారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు పోలీసులకు వెంటనే సమాచారం అందజేయాలని మహేశ్ భగవత్ విజ్ఞప్తి చేశారు.