Venu Swamy Case: వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామికి బిగ్ షాక్ తగిలింది. మొన్నటివరకు మహిళా కమిషన్‌కు సినిమా జర్నలిస్టుల ఫిర్యాదులు.. సోషల్ మీడియాలో ఆరోపణలు ఇలా.. కొంత హడావిడి జరిగి చల్లారిన వేణు స్వామి వివాదం ఇప్పుడు కోర్టు వరకు వెళ్లింది. జర్నలిస్టు మూర్తి వేసిన పిటిషన్ మీద నాంపల్లి కోర్టు విచారణ జరిపి.. వేణు స్వామిపై కేసు నమోదు చేయాలంటూ జూబ్లీహిల్స్ పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. వేణు స్వామిపై వస్తున్న ఆరోపణలపై విచారణ చేయాలని సూచించింది.