ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. వేణు స్వామిపై మహిళా కమిషన్‌కు ఫిలిం జర్నలిస్టు అసోసియేషన్ ఫిర్యాదు చేయగా.. వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఆ నోటీసులను సవాలు చేస్తూ వేణుస్వామి హైకోర్టును ఆశ్రయించగా.. ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ క్రమంలో.. అటు మహిళా కమిషన్ మీద.. ఇటు ఫిలిం జర్నలిస్టు అసోసియేషన్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయటం గమనార్హం.