వేపచెట్టు విషయంలో జరిగిన ఘర్షణ తీవ్ర విషాదానికి దారితీసింది. ఇంటి సరిహద్దులో ఉన్న వేపచెట్టు విషయంలో రెండు కుటుంబాల మధ్య సుమారు 25 ఏళ్లుగా వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే చెట్టు కొమ్మలు నరికే విషయంలో మరోసారి రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకోగా వెంకటేశ్వర్లుపై రాము గొడ్డలితో దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత తన తండ్రి సైదాపై కూడా రాము దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో ఇద్దరూ మృతి చెందారు. ఘటన తర్వాత రాము ఇంటిపై స్థానికులు రాళ్లదాడి చేయగా ఎస్‌ఐకి గాయాలు అయ్యాయి.