గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ వ్యవహారం ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం రేపుతోంది. విజయవాడ సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీ మోహన్‌ను వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వైఎస్ జగన్.. వంశీని అక్రమంగా ఇరికిస్తున్నారంటూ ఆరోపించారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ఆరోపణలకు మంత్రి కొల్లు రవీంద్ర కౌంటరిచ్చారు. వల్లభనేని వంశీతో పాటు అందరి బాగోతాలు బయటపెడతామన్న మంత్రి.. సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి హైదరాబాద్‌కు తీసుకెళ్లిన సీసీటీవీ ఫుటేజీ విడుదల చేశారు. అలాగే ఫిబ్రవరి 11న మై హోమ్ భుజాలో రికార్డైన దృశ్యాలను మంత్రి కొల్లు రవీంద్ర విడుదల చేశారు.