వైఎస్ జగన్‌కు ప్రతిపక్ష నేత హాదా ఇస్తారా.. ఇవ్వరా? తేల్చేసిన ఏపీ స్పీకర్.!

2 months ago 4
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదాపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను.. అయ్యన్నపాత్రుడు కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన అయ్యన్నపాత్రుడు.. వైసీపీకి ప్రతిపక్ష హోదాపై కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి ఉన్న సంఖ్యా బలం దృష్ట్యా వైఎస్‌ జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం సాధ్యం కాదని అయ్యన్న తెలిపారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా చట్టాలు, నిబంధనలు అనుసరించాల్సి ఉంటుందని.. వాటిని కాదని తనకు ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకోలేనని అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు.
Read Entire Article