Chintakayala Ayyanna Patrudu On Jagan Opposition Post: వైఎస్ జగన్‌కు ప్రతిపక్ష హోదా అంశంపై స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కీలక ప్రకటన చేశారు. ప్రతిపక్ష హోదా విషయంలో నిరాధార ఆరోపణలతో జగన్ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారన్నారు. ప్రతిపక్ష హోదాపై జగన్ హైకోర్టుకు కూడా వెళ్లారని.. న్యాయ ప్రక్రియ కొలిక్కి వచ్చేవరకు వేచి చూద్దామకున్నాను అన్నారు. ఇటీవల జగన్, వైఎస్సార్‌సీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలు తన దృష్టికి వచ్చాయని.. స్పీకర్‌కు దురుద్దేశాలు ఆపాదించడం సభా నియమాల ఉల్లంఘన కిందికి వస్తాయన్నారు.