YS Jagan Security: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కండీషన్‌లో ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇస్తామని ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తెలిపింది. జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనానికి రిపేర్ వచ్చింది. తన భద్రతపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. మరోవైపు.. వైఎస్ జగన్ అక్రమాస్తుల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.