Ys Jagan Tadepalli House Fire Accident: గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాసం దగ్గర రోడ్డు పక్కన ఉన్న గార్డెన్‌లో మంటలు చెలరేగాయి. బుధవారం సాయంత్రం ఒకసారి, రాత్రి తొమ్మిది గంటల సమయంలో మరోసారి మంటలు వ్యాపించాయని వైఎస్సార్‌సీపీ ఆరోపించింది. దీనికి సంబంధించిన వీడియోను వైఎస్సార్‌సీపీ అధికారిక ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్‌లో షేర్ చేసింది. వైఎస్ జగన్ ఇంటి వద్ద భద్రతా లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ఆరోపించింది.