Ys Jagan Security Petition Hearing: ముఖ్యమంత్రి హోదాలో తనకు ఉన్న భద్రతను పునరుద్ధరించాలంటూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై విచారణ జరగ్గా.. మూడో వ్యక్తి ఇంప్లీడ్ పిటిషన్ వేయడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇంప్లీడ్ పిటిషనర్ ఇండియన్ ముస్లింలీగ్ పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ ఖాజావలిపై మండిపడింది. ఇంప్లీడ్ పిటిషన్లు వేసి కోర్టులను ప్రచార వేదికలుగా వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ లాయర్ కూడా ఇంప్లీడ్ పిటిషన్‌ను కొట్టివేసినా తమకు అభ్యంతరం లేదని తెలిపారు.