Ys Jagan Ysrcp General Secretaries: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పలు నియామకాలు చేపట్టారు. పార్టీ ప్రధాన కార్యదర్శులుగా మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వేంపల్లి సతీష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని నియమించారు. అలాగే కొన్ని అనుబంధ విభాగాలకు కూడా నియామకాలు చేశారు. వైఎస్సార్‌సీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను నియమించారు. బీసీ సెల్ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, ఎస్సీ సెల్ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు, చేనేత విభాగం గంజి చిరంజీవి, విద్యార్థి విభాగం పానుగంటి చైతన్యను నియమించారు.