వైఎస్ వివేకా హత్య కేసులో ప్రధాన సాక్షి వాచ్‌మెన్ రంగన్న మృతి..

1 month ago 7
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ప్రధాన సాక్షి అయిన వాచ్‌మెన్ రంగన్న చనిపోయారు. 85 ఏళ్ల రంగన్న వయసు సంబంధిత అనారోగ్యంతో గత కొన్నిరోజులుగా బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే బుధవారం మధ్యాహ్నం మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో పోలీసులు రంగన్నను కడప రిమ్స్‌ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కన్నుమూశారు. రంగన్న మరణాన్ని కడప రిమ్స్ ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరించారు. మరోవైపు 2019 మార్చి 15న పులివెందులలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగింది. ఈ ఘటన అప్పట్లో పెను సంచలనం రేపింది. ఈ కేసులో వైఎస్ వివేకా ఇంటి వాచ్‌మెన్‌గా పని చేసిన రంగన్న సీబీఐకు వాంగ్మూలం ఇచ్చారు. ఈ నేపథ్యంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షిగా రంగన్న ఉన్నారు.
Read Entire Article