Pawan kalyan on YSR: మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ రెచ్చగొట్టకపోతే తాను రాజకీయాల్లోకి వచ్చే వాడిని కాదన్నారు. బాలు సినిమా పూర్తి అయిన తర్వాత ఓ పోలీస్ అధికారి తనను కలిశారని.. మిమ్మల్ని బద్నాం చేసే ప్రయత్నం జరుగుతోందని హెచ్చరించినట్లు తెలిపారు. ఆయన చెప్పినట్లుగానే రెండేళ్ల తర్వాత జరిగిందంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.