Ysrcp Presidents To 15 Departments: వైఎస్సార్‌సీపీలో పదవుల భర్తీలో భాగంగా, అనుబంధ విభాగాలకు అధ్యక్షులుగా మరికొందరిని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నియమించారు. మొత్తం 15 విభాగాలకు అధ్యక్షులను నియమించారు. మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి.. రైతు విభాగం అధ్యక్షుడిగా ఎంవీఎస్ నాగిరెడ్డిని నియమించారు. అలాగే లీగల్ సెల్, గ్రీవెన్స్, ట్రేడ్ యూనియన్, ఎస్టీ సెల్, మున్సిపల్, వాలంటీర్ ఇలా పలు అనుబంధ విభాగాలకు అధ్యక్షుల్ని నియమించారు.