మెడికల్ కాలేజీల్లోని ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులో ప్రవేశాలలో స్థానికత వివాదంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిని తక్షణమే విచారణకు స్వీకరించాలని ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం వద్ద తెలంగాణ తరఫు లాయర్ మెన్షన్ చేశారు. ఈ నేపథ్యంలో అర్జెంట్ అంశంా పరిగణించిన ధర్మాసనం.. త్వరగా విచారణకు తీసుకుంటామని తెలిపింది. ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు దీనిపై విచారణ జరిపన సుప్రీం కోర్టు ఆదేశాలు వెలువరించింది.