Visakhapatnam Gvmc Demolition In Vijayasai Reddy Daughter Land: వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి కూతురు నేహారెడ్డికి గ్రేటర్ వైజాగ్ మున్సిపల్ కార్పోరేషన్ షాకిచ్చింది. భీమిలి బీచ్ వద్ద సీఆర్‌జెడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ నేహారెడ్డి చేపట్టిన ప్రహారీ నిర్మాణాన్ని అధికారులు కూల్చివేశారు. నేహా రెడ్డి కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలను ఉల్లంఘించి ప్రహారీ నిర్మించారంటూ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ గత నెలలో హైకోర్టులో పిల్ కూడా దాఖలు చేశారు. విచారణ జరిపిన కోర్టు.. కీలక ఆదేశాలు ఇచ్చింది.