Ysrcp Mlc Anantha Babu Viral Video Complaint: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వీడియో ఎపిసోడ్ ఏపీలో దుమారం రేపుతోంది. ఈ వైరల్ వీడియో తనది కాదని అనంతబాబు క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అది మార్ఫింగ్ వీడియో అని.. గతంలో తనకు దాన్ని పంపించి బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపించారు. ఆ వీడియో చూపించి తన దగ్గర రూ.13.30 లక్షలు తీసుకున్నారని.. ఆధారాలు ఉన్నాయంటూ పోలీసులకు అందజేశారు.