ఎన్నికల్లో ఓటమితో తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి.. వరుసగా నేతల వ్యవహారశైలి తలనొప్పిగా మారింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ రచ్చ రచ్చ చేసింది. దివ్వెల మాధురి, దువ్వాడ శ్రీనివాస్‌ల వ్యవహారం ట్రెండింగ్ అయ్యింది. ఇది కాస్త మరుగనపడిందని అనుకుంటున్న తరుణంలో మరో ఎమ్మెల్సీ వీడియో వైరల్ అవుతోంది. ఆయన వీడియో కాల్‌లో మాట్లాడుతూ అసభ్యకరంగా ప్రవర్థించినట్టు అందులో ఉండటం తీవ్ర దుమారం రేపుతోంది.