Ysrcp Mlc Duvvada Srinivas Daughters: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం రచ్చకెక్కింది. గురువారం రాత్రి ఆయన ఇంటిముందు కుమార్తెలు నిరసనకు దిగారు. తమ తండ్రి కోసం బయట వేచి చూశారు. దువ్వాడ శ్రీను ఇంటిముందే కుమార్తెలు కారులో కూర్చుని చాలాసేపు వేచి ఉన్నారు. బయటి నుంచి పిలిచినప్పటికీ సిబ్బంది గేటు తీయలేదు.. దువ్వాడ కుటుంబంలో కొద్ది రోజులుగా వివాదాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. తమ తండ్రి మరో మహిళతో సహజీవనం చేస్తున్నట్లు కూతుళ్లు ఆరోపిస్తున్నారు.