ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం రద్దు చేసింది. ఎన్నికలకు ఏడాది ముందు వైఎస్ జగన్ ఈ కార్యక్రమం ప్రారంభించారు. తొలుత పార్టీ కార్యక్రమంగా అమలు చేయగా.. ఆ తర్వాత ప్రభుత్వ కార్యక్రమంగా మార్చారు. తాజాగా గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం రద్దు చేస్తూ ఏపీ ప్రణాళిక విభాగం ముఖ్య కార్యదర్శి నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య బీమా పథకం అమలుపైనా కీలక నిర్ణయం తీసుకున్నారు.