మాజీ మంత్రి, వైసీపీ ముఖ్య నేత జోగి రమేష్‌కు మరో షాక్ తగిలింది. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో మంగళగిరి పోలీసులు నోటీసులు జారీ చేశారు. మంగళవారం సాయంత్రం విచారణకు రావాలంటూ జోగి రమేష్‌కు నోటీసులు పంపించారు. మరోవైపు అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్‌ను సీఐడీ ఇప్పటికే అదుపులోకి తీసుకుంది. జోగి రాజీవ్ మీద సీఐడీ, ఏసీబీ కేసులు నమోదు చేసింది. ఏసీబీ కేసులో జోగి రాజీవ్‌ను ఏ1గా చేర్చారు. అయితే ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని జోగి రమేష్ ఆరోపిస్తున్నారు.