AP Womens Commission Ysrcp Leader Notice: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత భూపతిరాజు వెంకట సత్యనారాయణరాజు మహిళా డ్యాన్సర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఏపీ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 23న కమిషన్ ముందు హాజరుకావాలని ఆయనకు నోటీసులు జారీ చేశారు. మహిళల గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడటం సరికాదని కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ తెలిపారు.