ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ బలోపేతంపై దృష్టిసారించారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత డీలాపడిన పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం తేవటంతో పాటుగా పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు కొత్త కార్యక్రమం చేపట్టనున్నారు. సంక్రాంతి తర్వాత పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పర్యటించాలని వైఎస్ జగన్ నిర్ణయించారు. వారంలో రెండు రోజులు పార్లమెంట్ నియోజకవర్గాలలో పర్యటిస్తానన్న జగన్.. ఈ కార్యక్రమానికి కార్యకర్తలతో జగనన్న.. పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం అనే పేరు పెట్టారు.