గండిపేట భూకబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు రిలీఫ్ లభించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆయనకు రంగారెడ్డి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పోలీస్ స్టేషన్‌లో 15 రోజులకు ఒకసారి హాజరు కావాలని.. రూ.20 వేల చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా గండిపేట గ్రామంలోని వేయి కోట్ల విలువైన ప్రభుత్వం భూమిని కాజేసేందుకు నకిలీ జీవోలు సృష్టించారంటూ బొల్లా బ్రహ్మనాయుడిపై కేసు నమోదైంది.