వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి షాక్ తగిలింది. పేర్ని నాని సతీమణి జయసుధపై మచిలీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. పేర్ని నానికి చెందిన గోడౌన్‌లో రేషన్ బియ్యం అక్రమాలు జరిగాయని పౌరసరఫరాల శాఖ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి పౌరసరఫరా సంస్థ అధికారి కోటిరెడ్డి ఫిర్యాదు మేరకు పేర్ని నాని భార్య జయసుధపై మచిలీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. గోడౌన్ పేర్ని నాని సతీమణి జయసుధ పేరు మీద ఉండటమే ఇందుకు కారణం. మరోవైపు బియ్యా్న్ని తరలించే సమయంలో తరుగు వచ్చిందని పేర్ని నాని చెప్తున్నారు.