వైసీపీకి డబుల్ షాక్.. అవంతి బాటలోనే మరో మాజీ ఎమ్మెల్యే రాజీనామా

1 month ago 6
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గురువారం వరుస షాకులు తగిలాయి. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఉదయం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీ పదవులకు అవంతి శ్రీనివాసరావు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే అవంతి శ్రీనివాస్ రాజీనామా చేసిన కొద్దిసేపటికే మరో కీలక నేత వైసీపీకి గుడ్ బై చెప్పారు. వైసీపీకి భీమవరం మాజీ ఎమ్మె్ల్యే గ్రంధి శ్రీనివాస్ రాజీనామా చేశారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పదవులకు రాజీనామా చేస్తున్నట్లు గ్రంధి శ్రీనివాస్ వెల్లడించారు. ఈ మేరకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి రాజీనామా లేఖను పంపారు.
Read Entire Article