Uundavalli Arun Kumar YSRCP: మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వైసీపీలోకి చేరతారంటూ ఇటీవల ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. మాజీ మంత్రి, ఒకప్పటి కాంగ్రెస్ నేత సాకే శైలజానాథ్ వైసీపీలో చేరడంతో.. కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలో ఈ ప్రచారంపై ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. రాజమండ్రిలో విలేకర్ల సమావేశం నిర్వహించిన ఆయన.. ఏపీ రాజకీయాలపై మాట్లాడారు. అలాగే తాను వైసీపీలో చేరే అంశంపైనా క్లారిటీ ఇచ్చారు.