నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గుండెపోటుతో ఓ ఏఎస్సై ప్రాణాలు కోల్పోయాడు. ఇంట్లో వ్యాయామం చేస్తుండగా గుండెపోటు రాగా.. స్పాట్‌లోనే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అతడి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఇక మంగళవారం వరంగల్ జిల్లాలో ఓ నాలుగో తరగతి విద్యార్థికి గుండెపోటు వచ్చిన సంగతి తెలిసిందే.