హైదరాబాద్ శివారు శంకర్‌పల్లిలో జరిగిన దారి దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. స్టీల్ వ్యాపారి వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న మధు అనే వ్యక్తి ఈ దోపిడీకి ప్రధాన సూత్రధారి అని తేలింది. వికారాబాద్ నుండి రూ. 40 లక్షలు తీసుకువస్తుండగా.. తన గ్యాంగ్‌తో కలిసి దోపిడీ డ్రామా ఆడి పోలీసులకు చిక్కాడు. పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.