రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు వెళ్లే ప్రయాణికులకు గుడ్‌న్యూస్. హైదరాబాద్ నుంచి మరిన్ని పుష్పక్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. సికింద్రాబాద్ జేబీఎస్ నుంచి ఈ బస్సులు నడవనున్నాయి. మెుత్తం ఆరు బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. బస్సు టైమింగ్ వివరాలు వెల్లడించారు.