తలైవా రజినీకాంత్ నటించిన జైలర్ సినిమాలో వర్మ పాత్ర పోషించిన మళయాళ నటుడు వినాయకన్‌ను శంషాబాద్ ఎయిర్ పోర్టులో పోలీసులు అరెస్ట్ చేశారు. కొచ్చి నుంచి గోవా వెళ్తున్న సమయంలో.. కనెక్టింగ్ ఫ్లైట్ కోసం హైదరాబాద్ ఎయిర్ పోర్టులో వెయిటింగ్ చేస్తున్న సమయంలో.. మద్యం మత్తులో ఉన్న వినాయక్ సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్‌పై దాడి చేశాడంటూ ఫిర్యాదు అందటంతో.. శంషాబాద్ ఎయిర్ పోర్టు పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.